+91-9912 347 247 info@adsandhra.com
చంద్రుడిపై గుహలు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నాసా
చంద్రుడిపై గుహలు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నాసా
Posted on Thu, Jul 28, 2022
Description

రాత్రి కాగానే ఆకాశంలో చంద్రుడు చల్లని వెన్నెలను కురిపిస్తాడు. కానీ ఆ సమయంలో భూమి మీద ఉన్నంత చల్లగా చంద్రునిపై ఉండదు. చంద్రునిపై దాదాపు 127 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయట.

ఇది మనకు కనిపించే చంద్రునిలో ఉష్ణోగ్రత మాత్రమే. చంద్రునిలో మనకు కనిపించని చీకటి భాగంలో మైనస్ 173 డిగ్రీల సెల్సియస్ చలి ఉంటుంది. అలాంటి వాతావరణం ఉండే చంద్రునిపై మానవులు ఎక్కడ ఉండాలి? అనే ప్రశ్నకు నాసా పరిశోధకులు సమాధానం కనుక్కున్నారు.

జాబిల్లిపై మేర్ ట్రాంక్విలిటాటిస్ అనే ప్రాంతంలో చాలా సొరంగాలు ఉన్నాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సొరంగాలన్నీ గుహలకు దారి చూపిస్తాయని శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ సొరంగాల వద్ద వీటి ఉష్ణోగ్రతలు పెద్దగా మారడం లేదని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.

అక్కడ దాదాపు 17 డిగ్రీల సెల్సియస్ వద్దనే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని తేలింది. నాసాకు చెందిన లూనార్ రికనసెన్స్ ఆర్బిటర్ ఈ వివరాలను సేకరించింది. ఈ సొరంగాల ద్వారా ఆ గుహల్లోకి వెళ్లి అక్కడ మనుషులు ఉండి, పరిశోధనలు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-లాస్ ఏంజెలిస్‌ (యూసీఎల్‌ఏ) పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ గుహల్లో ఉండి వ్యోమగాములు తమ పరిశోధనలు కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు